‘చేయూత’.. వెల్లువ | - | Sakshi
Sakshi News home page

‘చేయూత’.. వెల్లువ

Sep 4 2026 7:41 AM | Updated on Sep 4 2026 7:41 AM

దరఖాస్తు గడువు పొడిగింపు..

–8లో u

నర్వ: సుదీర్ఘకాలం తర్వాత ప్రభుత్వం చేయూత పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అర్హులు సరైన ధ్రువపత్రాలతో ఈ నెల 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జిల్లాలోని పురపాలికలతో పాటు 272 గ్రామపంచాయతీల నుంచి మంగళవారం వరకు 11 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లుసెర్ప్‌ అధికారులు తెలిపారు.

జిల్లాలో ఇలా..

జిల్లావ్యాప్తంగా 72,734 మంది చేయూత పింఛన్లు పొందుతున్నారు. ఇందులో వృద్ధులు 25,389, వితంతువులు 29,707, దివ్యాంగులు 9.709, గీత కార్మికులు 872, చేనేత కార్మికులు 2,495), పైలేరియా 162, డయాలిసిస్‌ 108, బీడీ కార్మికులు 1,164 మంది ఉన్నారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ.18,78,50,416 మంజూరు చేస్తోంది.

అనర్హులను తొలగించి జాబితా..

జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 11,078 దరఖాస్తులు రాగా.. ఇందులో అత్యధికంగా వితంతు పింఛన్‌ కోసం 5,337, దివ్యాంగ పింఛన్‌కు 3,856 వచ్చాయి. అత్యల్పంగా గీత కార్మికులు 239 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా నారాయణపేట మండలం నుంచి 1,297, దామరగిద్ద నుంచి 1,148, నారాయణపేట పురపాలిక నుంచి 1,076, మక్తల్‌ నుంచి 1,055, ఊట్కూర్‌ నుంచి 1,034.. అత్యల్పంగా మద్దూర్‌ నుంచి 227, గుండుమాల్‌ నుంచి 59 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ, పురపాలికల్లో కమిషనర్‌ పర్యవేక్షణలో దరఖాస్తులు పరిశీలించనున్నారు. అక్రమాలకు తావులేకుండా దరఖాస్తులను నిశితంగా పరిశీలించి అనర్హులను తొలగించి జాబితా రూపొందించనున్నారు.

తప్పని దళారుల బెడద..

చేయూత పింఛన్ల కోసం దళారులు అమాయకులను మచ్చిక చేసుకొని దరఖాస్తుల స్వీకరణ మొదలు నుంచి వారితో డబ్బులు దంటుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దివ్యాంగులు కానివారు సైతం సదరం ధ్రువపత్రాలు పొందుతున్నట్లు సమాచారం. ఇలాంటి వారితో అర్హులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నట్లు దివ్యాంగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని పురపాలికలు, గ్రామపంచాయతీల్లో కొందరు ప్రజాప్రతినిధులు బేరసారాలు కూడా కుదుర్చుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగిన బాధితులు అడిగినంత ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్‌ స్పందించి దళారులను ఆశ్రయించొద్దని ప్రకటనలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.

ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా

11,078 దరఖాస్తులు

దరఖాస్తు గడువు పొడిగించిన ప్రభుత్వం

అనర్హులను తొలగించి జాబితా సిద్ధం చేసేలా అధికారుల కసరత్తు

గ్రామాలు, పట్టణాల్లో

తప్పని దళారుల బెడద

ప్రభుత్వం చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించింది. ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి. దళారులను ఆశ్రయించకుండా సమీప మీ–సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకో వాలి. గడువు పొడిగించిన విషయాన్ని గ్రా మాల్లో తెలియజేయాలని ఎంపీడీఓలకు ప్రభు త్వం ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేసింది.

– జయన్న,

డీపీఎం, నారాయణపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement