కొత్తపల్లి/కోస్గి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థుల సంఖ్య పెంచి బలోపేతానికి ఉపాధ్యాయు లు, స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు కోరారు. మంగళవారం మద్దూరు, కొత్తపల్లి, కోస్గిలో ఆయా మండలాల సర్పంచులు, కౌన్సిలర్లు, పలువురు విద్యా నిపుణులతో నిర్వహించిన సమావేశంలో ఎంఈఓలు, ఎంపీడీఓలు భార్గవరాం, శ్రీధర్, కొండన్నతో కలిసి పాల్గొన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యావ్యవస్థ కుంటుపడుతోందని పలువురు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పలువురు ఉపాధ్యాయులు పాఠశాలలకు వచ్చి విద్యార్థులకు బోధించడం లేదని, కొన్ని పాఠశాలల్లోవిద్యార్థులు ఎక్కువ.. ఉపాద్యాయులు తక్కువ ఉన్నారని, దీంతో పిల్లలను ప్రభుత్వ పా ఠశాలలకు పంపించడానికి అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆయా విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని.. అందించిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓలు ఆంజనేయులు, జనార్దన్‌రెడ్డి, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


