● పలు అభివృద్ధి పనుల పరిశీలన
● ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ
–8లో u
కోస్గి(కొత్తపల్లి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవా రం మద్దూర్‌లో పర్యటించనున్నారు. గురువారం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ డా. వినీత్ స్థానిక అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల పరిశీల నకు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో పర్యటన లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీ సుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టణ శి వారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపం దోరేపల్లి రోడ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలంతో పాటు ముఖ్యమంత్రి పర్యటించే రోడ్ మ్యాప్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి రూ.6.10 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం, పాత బస్టాండ్ చౌరస్తాలో రహదారి విస్తరణలో దె బ్బతిన్న హనుమాన్ ఆలయాన్ని పరిశీలించడంతో పాటు మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ విషయమై స్థానిక నేతలతో చర్చించనున్నారు. చింతల్‌దిండి రోడ్‌లో రూ.30 కోట్లతో నిర్మిస్తున్న ఎస్సీ గు రుకుల పాఠశాల, కళాశాలల భవన నిర్మాణ పనుల ను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ము ఖ్యమంత్రి పర్యటించే మార్గంలో ట్రాపిక్ సమస్యలు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొటోకాల్ విషయంలో తగిన జాగ్రత్త లు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు అన్ని శాఖల అధికారులతో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు.


