భూ సేకరణ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూ సేకరణ వేగవంతం చేయాలి

Aug 21 2026 9:38 AM | Updated on Aug 21 2026 9:38 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక

నారాయణపేట: బుద్వేల్‌–నాచారం రేడియల్‌ రోడ్‌ ప్రాజెక్టుకు సంబంధించి కోస్గి మండలం నాచారం, తోగాపూర్‌ గ్రామాల పరిధిలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రైతులతో వేర్వేరుగా జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని కోరారు. భూ నష్ట పరిహారాన్ని ప్రభుత్వ నిబంధనలు, సంబంధిత భూమి ప్రాథమి క మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ఇతర జిల్లాల్లో అమలవుతున్న పరిహార చెల్లింపులను జిల్లాతో నేరుగా పోల్చడం సరికాదన్నారు. ప్రతి ప్రాంతంలో ప్రాథమిక మార్కెట్‌ విలువ, భూ సేకరణ నిబంధనల ఆ ధారంగానే పరిహారం నిర్ణయిస్తామని తెలిపా రు. ప్రస్తుత మార్కెట్‌ వి లువలో వచ్చిన మార్పులను కూడా నిబంధనల మేరకు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పా రు. భూ సేకరణ చట్టం ప్రకారం అర్హత కలిగిన భూ యజమానులకు మార్కెట్‌ విలువతో పా టు చట్టబద్ధమైన సొలాటియం, అదనపు పరి హారం తదితర ప్రయోజనాలు అందుతాయని వివరించారు.భూ యజమానులు అంగీకరిస్తే ప రస్పర సమ్మతితో పరిహారం చెల్లింపు ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. అంగీకారం లేని పక్షంలో చట్ట ప్రకారం జనరల్‌ అవార్డు ప్రక్రి యను కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భూ సేకరణ ప్రక్రియ ఆలస్యం కాకుండా పూర్తి చేస్తే రేడియల్‌ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించి పూర్తిచేసే అవకాశం ఉంటుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. భూ యజమానుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిబంధనలకు లోబడి సాధ్యమైనంత త్వరగా పరిహారం అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లా అభివృద్ధితో పాటు రేడియల్‌ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణానికి భూ యజమానులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను, జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మనన్‌్‌ వార్ల విజయ్‌కుమార్‌, ఆర్డీఓ రమేష్‌, కోస్గి తహసీల్దార్‌ కళ్యాణి, భూ సేకరణ విభాగం డీటీలు, నాచారం, తోగాపూర్‌ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement