నత్తనడకనే..
నారాయణపేట: ఎల్‌ఆర్‌ఎస్ (లే–అవుట్ రెగ్యులరైజేషన్‌న్ స్కీం) దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మూడో సవరణలో భాగంగా 25 శాతం రిబేట్‌తో ఫీజు, చార్జీల చెల్లింపునకు 2026, నవంబర్ 30 వరకు పొడిగిస్తూ మెట్రోపాలిటనన్ ఏరియా అండ్ అర్బనన్ డెవలప్‌మెంట్‌శాఖ జూలై 31న జీఓ జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి న వంబర్ 30 వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. జిల్లాలోని 13 మండలాలు, నాలుగు పు రపాలికల పరిధిలో మొత్తం 37,110 దరఖాస్తులు రాగా.. 5,311 దరఖాస్తులు ఆమోదం పొందగా.. 25,039 దరఖాస్తులు సిటిజన్‌న్‌స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయి. మరో 6,706 దరఖాస్తులు అధికారు ల స్థాయిలోని ఎల్–1, ఎల్–2, ఎల్–3 దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో భారీ సంఖ్యలో ద రఖాస్తులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాజా ని ర్ణ యం దరఖాస్తుదారులకు కాస్త ఊరటనిచ్చినట్లు అ యింది. నిర్ణీత గడువులో ఫీజు చెల్లింపులు పూర్తి చేసుకునేందుకు అవకాశం లభించడంతో పెండింగ్ దర ఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమం కానుంది.
సిటిజనన్‌స్థాయిలో 25 వేల దరఖాస్తులు..
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో ప్రధాన సమస్య సిటిజన్ స్థాయిలోనే కనిపిస్తోంది. 25,039 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. 18,309 దరఖాస్తులకు ఫీజు చెల్లించాల్సి ఉంది. మరో 400 దరఖాస్తులకు ఫీజు సమాచారం అందలేదు. 4,706 దరఖాస్తులు ఐజీఆర్‌ఎస్ కేటగిరీలో ఉన్నాయి. మరో 1,624 దరఖాస్తులకు ఫీజు చెల్లింపు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సిటిజన్ స్థాయితో పాటు అధికారుల వద్ద కూడా భారీగా ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎల్–1 వద్ద 3,124, ఎల్–2 వద్ద 3,247, ఎల్–3 వద్ద 335 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 6,706 ఫైళ్లు అధికారుల స్థాయిలో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.
పురపాలికల్లో జోరు..
పురపాలికల్లో ఎల్‌ఆర్‌ఎస్ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు భారీ స్పందన లభించింది. ఆగస్టు 4 నాటికి జిల్లాలోని నాలుగు పురపాలికల పరిధిలో 5,641 దరఖాస్తులకు ఫీజు చెల్లింపు జరిగింది. ఇందులో 3,525 దరఖాస్తులు ఆమోదం పొందగా.. 15 తిరస్కరణకు గురయ్యాయి. మరోవైపు ఎల్–1, ఎల్–2, ఎల్–3 స్థాయిలో 433 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పురపాలికల వారీగా చూస్తే నారాయణపేటలో అత్యధికంగా 1,310 దరఖాస్తులు ఆమోదం పొందాయి. తర్వాత మక్తల్‌లో 1,153, కోస్గిలో 757, మద్దూర్‌లో 305 దరఖాస్తులకు ఆమోదం లభించింది.
● కోస్గిలో ఎల్–1లో 212, ఎల్–2లో 5, ఎల్–3లో 66 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫీజు సమాచారం అందని విభాగంలో ఎల్–1లో 325, ఎల్–2లో ఏకంగా 571 దరఖాస్తులు ఉన్నాయి. మక్తల్‌లో ఎల్–1లో 21, ఎల్–2లో 7, ఎల్–3లో 57 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. నారాయణపేటలో ఎల్–1లో 16, ఎల్–2లో 4, ఎల్–3లో 15 దరఖాస్తులు ఉన్నాయి.
గ్రామపంచాయతీల్లో రూ.5.07 కోట్లే..
జిల్లాలోని గ్రామపంచాయతీలు, పురపాలికల్లో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రూ.25 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం రూ.16 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఇందులో పురపాలికల్లో రూ.11 కోట్లు ఉండగా.. నారాయణపేట రూ.5.19 కోట్లతో ముందంజలో ఉంది. మక్తల్ రూ.3.12 కోట్లు, కోస్గి రూ.2.30 కోట్లు, మద్దూర్ రూ.0.39 కోట్ల ఫీజు వసూలు చేశాయి. అదేవిధంగా జిల్లాలోని 13 మండలాల్లో 3,916 దరఖాస్తులు రాగా.. రూ.5.07 కోట్లు వసూలైంది.
అనధికార లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. లే–అవుట్ల క్రమబద్ధీకరణకు గ్రామపంచాయతీలు, 412 దరఖాస్తులు రాగా.. ఇప్పటి వరకు 40 దరఖాస్తులు మాత్రమే ఆమోదం పొందాయి. 294 దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు పురపాలికల పరిధిలో 282 దరఖాస్తులు రాగా.. ఇందులో 34 ఆమోదం పొందగా.. 203 దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మరో 14 దరఖాస్తులు షార్ట్‌ఫాల్‌లో ఉండగా.. 10 నిషేధిత కేటగిరీలో ఉన్నాయి. గ్రామపంచాయతీల పరిధిలో 130 దరఖాస్తులు అందగా.. కేవలం 6 దరఖాస్తులు ఆమోదం పొందాయి. 91 దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉండగా.. 12 షార్ట్‌ఫాల్, ఒకటి నిషేధిత కేటగిరీలో ఉంది.
నవంబర్ 30 వరకు గడువు పొడిగింపు
25 శాతం రిబేట్‌తో
చెల్లింపునకు అవకాశం
జూలై 31న ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
లక్ష్యం రూ.25 కోట్లు...
వసూలైంది రూ.16 కోట్లే..


