కోస్గి: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోత ల పథకంలో భాగంగా కాల్వల నిర్మాణంలో భూ ములు కోల్పోతున్న రైతులను ఆదుకుంటామని నారాయణపేట ఆర్డీఓ రమేష్ తెలిపారు. బుధవా రం మండలంలోని ముక్తిపాడ్‌లో కొనసాగుతున్న హస్నాబాద్ – మాసాయిపల్లి కాల్వ భూ సర్వే పనులను అడ్డుకున్న రైతులతో ఆయన మాట్లాడారు. ఇప్పటికే కాల్వల హద్దులు గుర్తించామని.. గ్రామంలో సుమారు 30 మంది రైతులు భూమి కోల్పోతున్నారని, వారి భూములను సర్వే చేసి నివేదికలను అధికారులకు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్వాసితులకు నష్ట పరిహారం అందించి ఆదుకుంటుందని చెప్పారు. సాగునీటి కాల్వల నిర్మాణంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, నీటి వనరులతో పంటలు ఎక్కువగా పండి ఆర్థికంగా లబ్ధి పొందుతారని సహకరించాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, ఇరిగేషన్ ఏఈ నిర్మల, పలువురు సర్వేయర్లు ఉన్నారు.
ఈ–నామ్ టెండర్‌లో
సాంకేతిక సమస్య
● 19 మంది రైతులకు
మాన్యువల్‌గా ధరల నమోదు
నారాయణపేట: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో మంగళవారం నిర్వహించిన ఈ–నామ్ టెండర్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తి కొందరు రైతుల లాట్లకు ఆన్‌లైన్‌లో ధరలు నమోదు కాలేదు. దీంతో మార్కెట్ అధికారులు మాన్యువల్‌గా ధరలు నిర్ణయించి రైతులకు నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టారని మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డి బుధవారం తెలిపారు. లాట్ నంబర్ 107కు ఈ–నామ్‌లో రూ.8,169 ధర నమోదు కాగా, మాన్యువల్‌గా రూ.9,307.. లాట్ నంబర్ 106కు రూ.9,259 నమోదు కాగా, మాన్యువల్‌గారూ.9,267.. లాట్ నంబర్ 9కు రూ.8,639 నమోదు కాగా, మాన్యువల్‌గారూ.9,177.. లాట్ నంబర్ 10కు రూ.6,269 నమోదు కాగా, మాన్యువల్‌గా రూ.9,007 ధర లభించిందన్నారు. ఇదేవిధంగా మొత్తం 19 మంది రైతులకు క్వింటాకు సుమారు రూ.600 నుంచి రూ.2,700 వరకు అదనపు ధరలు లభించినట్లు వివరించారు. ఈ–నామ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకోలేదని, సాంకేతిక సమస్యల కారణంగానే మాన్యువల్ విధానంలో ధరలు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యను ఆధారంగా చేసుకొని మార్కెట్ సిబ్బందిపై దుష్ప్రచారం చేయడం సరికాదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పేర్కొన్నారు.
పెసర క్వింటా రూ.9,611
నారాయణపేట: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం పెసరకు గరిష్ట ధర నమోదైంది.మార్కెట్ కమిటీ విడుదల చే సి న వివరాల ప్రకారం 430 బస్తాల్లో 210.70 క్వింటాళ్ల పెసర రాగా..గరిష్టంగా క్వింటా రూ. 9, 611, కనిష్టంగా రూ.6,120, సరాసరి ధర రూ. 9,027 పలికింది. పంట నాణ్యత, తేమశా తం ఆధారంగా ధరల్లో వ్యత్యాసం కనిపించింది.


