
మార్మోగిన శివనామస్మరణ
కళాకారుల అడుగుల భజన.. డోలు వాయిద్యం.. కోలాటం.. ఒగ్గుడోలు వివిధ కళాప్రదర్శనలు ఒకవైపు.. ఓం నమఃశివాయ.. హరహర మహాదేవ శంభో శంకర అను భక్తుల నామస్మరణ మరోవైపు.. ఇలా కోస్గి పట్టణమంతా సోమవారం పండుగ వాతావరణం నెలకొంది
కురిహినశెట్టి(జాండ్ర సంఘం) ఆధ్వర్యంలో శ్రావణ మాస ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నీలకంఠ స్వామి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజల అనంతరం పల్లకీలో స్వామి వారిని ఊరేగిస్తూ ఆటపాటలు, భజనల నడుమ గంగా స్నానానికి తీసుకెళ్లారు.
ప్రతి గడప నుంచి నీటి బిందెలతో యువకులు, కుల పెద్దలు, సంఘ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ రకాల కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. – కోస్గి