
సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి
నారాయణపేట: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రజావాణి హాల్లో గల సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, గౌడ సంఘం సభ్యులు, అధికారులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నాటి మొఘల్ రాజుల దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకుని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను పాపన్న గౌడ్ అందించారని కొనియాడారు. గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందన్నారు.స అనంతరం ధన్వాడకు చెందిన బాలకృష్ణ సర్దార్‌సర్వాయి పాపన్న వేషధారణతో ప్రదర్శన అందరిని అకట్టుకుంది. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఇంచార్జ్ అధికారి ఉమాపతి, డీపీఆర్‌ఓ రషీద్, జెడ్పీఈసీఓ శైలేష్, సీఐ అనంతయ్య, నాయకులు లక్ష్మణ్ గౌడ్, శ్యాంసుందర్ గౌడ్, వెంకటేష్‌గౌడ్, ఆనంద్‌కుమార్‌గౌడ్, రవికుమార్ గౌడ్ పాల్గొన్నారు.