
కళాశాలను మరో భవనంలోకి మార్చండి
మక్తల్: ప్రభుత్వ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో వెంటనే ప్రైవేట్ భవనంలోకి కళాశాలను మార్చాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం పట్టణంలోని మినీ స్టేడియాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుత కళాశాల భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన నిర్మాణం కోసం ఎంత భూమి అవసరం అవుతుందని ఆరా తీశారు. మైదానం ఎన్ని ఎకరాల్లో ఉందో సమగ్ర సర్వే చేయించి రిపోర్టు ఇవ్వాలన్నారు. జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఇండోర్ స్టేడియం భవనాలను తొలగించే విషయంపై అధికారులతో చర్చించారు. విద్యార్థుల కోసం పక్కన ఉన్న ప్రైవేట్ భవనంలోకి మార్పు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించడం జరిగిందని అన్నారు. అనంతరం మక్తల్ మండలం కర్ని చెరువు అలుగు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడంతో అక్కడికి చేరుకొని పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, తహసీల్దార్ సతీస్‌కుమార్, ఎంపీడీఓ రమేష్, కమిషనర్ శంకర్‌నాయక్, వాకిటి శేషగిరి తదితరులు పాల్గొన్నారు.