
చదువుతోపాటు సంస్కారం నేర్పాలి
ఊట్కూరు: తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పించాలని పండిత్ ప్రియదత్తు శాస్త్రి అన్నారు. ఊట్కూరులోని ఆర్యసమాజ్ భవ నంలో నిర్వహిస్తున్న శ్రావణవేద త్రిదివసీయ కార్యక్రమం ఆదివారం ముగిసింది. మూడు రోజులపాటు ఉదయం, సాయంత్రం వేళల్లో వేదయజ్ఞం ప్రవచనాలు నిర్వహించారు. చివరిరోజు పూర్ణాహు తి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసమానతలు, రుగ్మతలను రూపు మాపేందుకు ఆర్యసమాజం కృషి చేస్తుందన్నారు. ప్రపంచంలో భారతదేశ కుటుంబ వ్యవస్థ పటిష్టమైనదని.. కుటుంబ వ్యవస్థ ఇలాగే కొనసాగాలంటే పిల్లలకు చదువుతో పాటు సంస్కారం చాలా ముఖ్యమన్నారు. సాత్విక ఆహారం భుజించాలని, దాన ధర్మా లు చేపట్టాలని ఆయన కోరారు. ఆర్యసమాజం వ్యక్తిలో సంస్కారాన్ని నింపేందుకు పాటు పడుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గరిడి లింగిరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు బాల్‌రెడ్డి, ఆర్యసమాజ్ ప్రతినిధులు కనకప్ప ఆర్య, శివపాల్, దివాకర్, పవన్, బాలరాజు, జ్ఞానేశ్వర్, సుధాకర్ పాల్గొన్నారు.