
‘ఉపాధి’ లక్ష్యాలను పూర్తి చేయాలి
నారాయణపేట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూర్తి చేయాలని దేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ అమలుపై జిల్లాలోని ఎంపీడీఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎవరి పరిధిలో వారికి ఇచ్చిన లక్ష్యాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలన్నారు. లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయకున్నా కనీసం 75 శాతమైనా చేయాలని సూచించారు. అలాగే జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. మద్దూర్, కోస్గి, నర్వ, ఊట్కూర్, నారాయణపేట,మద్దూర్, మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా మండలాలకు నిర్ధేశించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. మిగతా జిల్లాలో పోలిస్తే జిల్లా లక్ష్యాల పరంగా వెనకబడి ఉందని స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే సమీక్షా సమావేశంలో మళ్లీ ఇదే తరహా అసంపూర్తి లక్ష్యాల వివరాలు ఉండరాదని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ మొగులప్ప, డీపీఎంలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు.