అడిషనల్ కలెక్టర్ బదిలీ
నారాయణపేట రూరల్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో నారాయణపేట లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టరర్‌గా విధుల నిర్వర్తిస్తున్న సంచిత్ గంగ్వార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మల్కాజ్ గిరి విభాగం జోనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న నారాయణ్ అమిత్ మలెంపాటిని నారాయణపేటకు కేటాయించారు. ప్రస్తుతం నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ సైతం సెలవులో ఉండడంతో ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఎఫ్‌ఎసీ బాధ్యతలను సంచిత్ గంగ్వార్ వ్యవహరిస్తున్నారు.
ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలోని 5 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని మహబూబ్‌నగర్ గిరిజన సంక్షేమ అధికారి జనార్ధన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 8వ తరగతి ఎస్సీ, ఎస్టీ బాలురకు రూ.వెయ్యి, బాలికలకు రూ.1500, రాజీవ్ విద్యా దీవెన కింద 9, 10వ తరగతి డే స్కాలర్ విద్యార్థులకు రూ.2250 అందజేస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈపాస్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థి ఫొటో, ఆదార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్‌బుక్కు, రేషన్‌కార్డు, కులం, ఆధాయ ధ్రువపత్రాలు అవసరమని తెలిపారు. అన్ని వివరాలు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేసి ఈ పాస్ ద్వారా పూర్తి చేసిన దరఖాస్తులను మంజూరు కొరకు మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లోని గిరిజన సంక్షేమ అధికారి కార్యాలయంలో ఈ నెల 31 లోపు అందజేయాలని తెలిపారు.
పద్యాకృతుల ఆవిష్కరణ మహోత్సవం
స్టేషన్ మహబూబ్‌నగర్: జాతీయ సాహిత్య పరిషత్ పాలమూరు జిల్లాశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి రాచాలపల్లి బాబుదేవిదాస్‌రావు రచించిన ‘రామచంద్ర ప్రభో’, ‘చిత్రాంగద– సారంగధరుడు’ పద్యకృతుల ఆవిష్కరణ మహోత్సవాన్ని గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. జాతీ య సాహిత్య పరిషత్ జిల్లాశాఖ అధ్యక్షుడు ఇరివింటి వెంకటేశ్వరశర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సాహిత్యం జగద్వితం కోసం సృష్టించబడుతుందన్నారు. కవులు సమాజ హితాన్ని కోరుకుంటారని తెలిపారు. ముఖ్య అతిథి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రామచంద్ర ప్రభో కావ్యం సరళమైన, సుందరమైన సుమధుర తెలుగు భాషలో అందించినట్లు తెలిపారు. ఇందు లో ప్రాచీన కవుల గుంబనం, లలిత పదజాతం ఆకట్టుకుంటుందన్నారు. రామచంద్రప్రభో మకుటంతో ఆద్యంతం పద్యాలను ఎంతో శ్రావ్యంగా చదువుతూ బాబుదేవిదాసును అభినందిస్తూ సమీక్ష చేశారు. డాక్టర్ పొద్దుటూరు ఎల్లారెడ్డి రామచంద్రప్రభో మకుటం ఉన్న 131 పద్య కావ్యాన్ని, పద్యాలను చదువుతూ రామ కథను అసాంతం పరి చయం చేశారు. డాక్టర్ తంగెళ్లపల్లి శ్రీదేవి చిత్రాంగద–సారంగధరుడు కథను 126 ప్యదాల కృతిని సమీక్ష చేస్తూ చక్కగా వివరించారు. అదేవిధంగా ప్రముఖ న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి, అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి, డాక్టర్ కె.బాలస్వామి, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ పద్యకృతులపై ప్రసంగించారు. కార్యక్రమంలో పాలమూరు నగర అధ్యక్షులు జి,శాంతారెడ్డి, కవులు ప్రభులింగంశాస్త్రి, దేవదానం, రవీందర్‌రెడ్డి, ఖాజా మైనొద్దీన్, జగపతి రావు, గడ్డం వనజ, డాక్టర్ కృష్ణవేణి, జమున, ఈశ్వరమ్మ, గుముడాల చక్రవర్తి, శ్యాంప్రసాద్, అను రాధ, వీరేందర్‌గౌడ్, శ్రీరాములు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన జనమంచి గౌరీశంకర్ (గౌరీజీ) పేరిట ఏటా అందజేసే యువ పురస్కార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్‌తేజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపే సేవా కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, ప్రముఖ రంగాల్లో విశేష కృషి చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ భావాలు కలిగిన 40 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. తాము చేపట్టిన కార్యక్రమాల వివరాలతో దరఖాస్తుదారులు ఆదివారంలోగా sosabvptg@gmail.com కు పంపుకోవాలన్నారు. పూర్తి వివరాలకు పాలమూరు విభాగ్ ప్రముఖ్ రామచందర్ (సెల్ నం.9440981137)ను సంప్రదించాలని సూచించారు.


