దేశం గర్వించదగ్గ స్ఫూర్తి ప్రదాత వాజ్‌పేయి
నారాయణపేట: దేశం గర్వించదగ్గ స్ఫూర్తి ప్రదాత మాజీ ప్రదాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం మాజీ ప్రధాని జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వాజ్ పాయ్ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. రాజకీయాల్లో విలువలు పెంచిన మహానాయకుడని.. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు నేటి యువత ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ నందు నామాజీ, జిల్లా కోశాధికారి సిద్ది వెంకట్ రాములు, జిల్లా కార్యదర్శి సుజాత, సత్య రఘుపాల్, పోషల్ వినోద్, మిర్చి వెంకటయ్య, శ్యామ్ సుందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


