
చివరి దశలో భవనాల నిర్మాణం..
పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలల భవనాల నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయి. యూనివర్సిటీలో ప్రస్తుతం నిర్మితమవుతున్న సైంటిఫిక్ రీసెర్చ్ భవనంలో కొంత భాగాన్ని ఇంజినీరింగ్ కళాశాలకు కేటాయించనున్నారు. అదేవిధంగా నిర్మితమవుతున్న ఎంఈడీ కళాశాల భవనం మొదటి అంతస్తులో లా కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా భవనాల పనులు చివరి దశలో ఉన్నాయి. వీటితో పాటు ఆయా విభాగాల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థులు సుమారు 300 మందికి హాస్టల్ వసతి కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్తగా హాస్టల్ భవనాలు నిర్మించే వరకు తాత్కాలికంగా వసతికల్పించేలా ముందుకు సాగుతున్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఇదివరకే వేర్వేరుగా నిర్మించిన హాస్టల్ భవనాల్లోనే లా, ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందే వారిని సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి.