ఉపాధి కూలీలకు వసతులు కల్పించండి
ఆత్మకూర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని డీఆర్‌డీఓ ఉమాదేవి సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని పిన్నంచర్లలో మంగళవారం జరుగుతున్న ఉపాధి పనులను ఆమె పరిశీలించారు. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు టెంట్లు, తాగునీరు, ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలిగించకుండా ఎప్పటికప్పుడు ధాన్యం సేకరించాలని ఐకేపీ సిబ్బందిని డీఆర్‌డీఓ ఆదేశించారు. పిన్నంచర్లలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరామ్‌రెడ్డి, ఏపీఓ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


