వెంటనే విడుదల చేయాలి..
నేను ఉన్న పొలంలో వానాకాలం కంది, వరి సాగు చేశా. ఆశించిన దిగుబడిరాక పెట్టిన పెట్టుబడి కూడా చేతికందడం లేదు. ప్రభుత్వం స్పందించి రైతులు అప్పుల పాలు కాకుండా యాసంగి సాగుకుగాను రైతు భరోసా నిధులు వీలైనంత త్వరగా విడుదల చేసి ఆదుకోవాలి.
– బస్వరాజ్, రైతు, మద్దెల్‌బీడు
ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు
రైతుభరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. అందరు రైతులకు అందజేస్తారా లేదా పంట వేసిన వారికే ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ముందుకుసాగుతాం.
– జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి
●


