రైతులకు ‘గుర్తింపు’
రైతులు విధిగా
నమోదు చేసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. రైతులు ఈ నెల 5 నుంచి ఫార్మర్ ఐడీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర పథకాలు అందాలంటే ఈ గుర్తింపు కార్డు తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మాత్రం ఈ కార్డుతో సంబంధం లేకుండా యధావిధిగా కొనసాగుతాయి. ఈ గుర్తింపు కార్డు రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాల ఆధారంగా జారీ చేస్తాం. ఫార్మర్ ఐడీ ఏ రకమైన చట్టబద్ద యాజమాన్య హక్కు కల్పించదనే విషయాన్ని రైతులు గుర్తించి వెంటనే కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
– జాన్ సుధాకర్,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
● నేటి నుంచే నమోదు ప్రక్రియ
ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశం
● గుర్తింపు కార్డుతో ఆధార్, పట్టాపాసు బుక్కు, ఫోన్ నంబర్ అనుసంధానం
● కేంద్ర వ్యవసాయ పథకాలకు
కీలకంగా మారునున్న ‘ఫార్మర్ ఐడీ’
● భూమి రకం, పంట సాగు వివరాలు నమోదు
14 అంకెలతో ప్రత్యేక నంబర్ కేటాయింపు
రైతులకు ‘గుర్తింపు’


