కూల్‌పై కూపీ..!
‘సాక్షి’ కథనాలపై కదిలిన ‘అధికార’ యంత్రాంగం
● మద్యం షాపుల్లో కూల్ పాయింట్ల వివాదంపై నజర్
● నేరుగా రంగంలోకి దిగిన ‘ఎకై ్సజ్’ ఉన్నతాధికారులు
● వైన్స్ దుకాణాల ఓనర్ల నుంచి వివరాల సేకరణ
● ‘షెటర్ల’ కేటాయింపుల్లో అక్రమాలపైనా విచారణ
● పురపాలక శాఖకు ముఖ్య నేత ఆదేశాలు
● ఇంతకు ఎవరా నాయకులు.. ‘ఇంటెలిజెన్స్’ ఆరా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని వైన్స్ షాపుల్లో కూల్ పాయింట్లు, వీధి వ్యాపారులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణాల కేటాయింపుల్లో చోటుచేసుకున్న దందాపై ‘అధికార’ యంత్రాంగం దృష్టిసారించింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగిన బాగోతాలపై ‘కూల్‌శ్రీగా దోపిడీ’, ‘నేతల వసూళ్ల పర్వం’ శీర్షికన ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన వరుస కథనాలు సంచలనం సృష్టించాయి. అధికార కాంగ్రెస్‌లోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నడిపించిన ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కూపీ లాగుతున్నారు. దీంతో అసలేం జరుగుతోంది.. ఈ వివాదాలకు ఎవరెవరు కారణం అని పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సైతం నేరుగా రంగంలోకి దిగారు. తమకు పార్టీలో అత్యంత నమ్మకంగా ఉన్న వేగుల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.


