వేలానికి దొడ్డు బియ్యం
రేషన్ దుకాణాలు, గోదాముల్లో పేరుకున్న నిల్వలు
టెండర్ ప్రకారం బియ్యం
అప్పగిస్తాం
మార్చి నుంచి నిల్వలు
మరికల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో దొడ్డు బియ్యం మరుగున పడింది. వీటిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రేషన్ దుకాణాల్లో నిల్వలు ఉన్నాయి. దీంతో దొడ్డు బియ్యం వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పంపిణీలో భాగంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో దొడ్డు బియ్యం వేలం వేలానికి చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ నెల 20న టెండర్ ప్రకటన జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్ దుకాణాలు, స్టేజీ–1, స్టేజీ–2 గోదాముల్లో దొడ్డు బియ్యం నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో అధికారులు ఆయా మండలాల వారీగా ఎంతమేర దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయనేది రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు పంపారు. ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్ టెండర్ ప్రక్రియ మొదలు పెట్టారు. 29వ తేదీ వరకు ఆన్‌లైన్ టెండర్ వేసుకోవచ్చు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 301 రేషన్ దుకాణాల పరిదిలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తూ దొడ్డు బియ్యం నిల్వలను గుర్తించారు.
ఈ ఏడాది మార్చి నుంచి దొడ్డు బియ్యం రేషన్ దుకాణాల్లోనే నిల్వ ఉన్నాయి. వాటి సేకరణపై అధికారులు వివిధ రకాలుగా కసరత్తు చేస్తున్నారు. దుకాణాల్లో నిల్వలు ఉన్నాయా, లేక నిర్ణయించిన తేదీ నాటికి వాటి సేకరణ పూర్తవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల్లో పొందుపరిచిన నిల్వలకు వాస్తవ నిల్వలను అధికారులు పోలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 301 రేషన్ దుకాణాల్లో, గోదాముల్లో కలిపి 190 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలున్నట్లు అధికారులు గుర్తించారు. నిల్వలు తక్కువగా ఉన్న చోట బృందాలుగా ఏర్పడి పరిశీలిస్తున్నారు. టెండర్ ద్వారా దొడ్డు బియ్యాన్ని దక్కించుకున్న టెండర్‌దారుడు ఆ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకెళ్లి విక్రయించుకోవడం కోసం ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. టెండర్ ప్రక్రియ పూర్తయ్యాక బియ్యాన్ని సంబంధించిన వివిరాలను ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంటుంది.
నేటితో ముగియనున్న టెండర్ ప్రక్రియ
జిల్లా వ్యాప్తంగా 190 క్వింటాళ్ల దొడ్డు బియ్యం
ఆన్‌లైన్ టెండర్ ప్రక్రియ పూర్తయ్యాక.. ఉన్నతాధికారుల సూచన మేరకు మరో తేదీని ఖరారు చేసి టెండర్‌దారుల సమీక్షంలో దొడ్డు బియ్యాన్ని టెండర్ వేస్తాం. ఎవరు ఎక్కువగా ధర పాడితే వారికి బియ్యం అప్పగించేందుకు చర్యలు తీసుకుంటాం. టెండర్ వివరాలను ప్రభుత్వానికి అప్పగిస్తాం.
– బాల్‌రాజ్, డీఎస్‌ఓ
వేలానికి దొడ్డు బియ్యం


