నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
నారాయణపేట ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నుంచి జూన్ 11 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, సాంఘీక సంక్షేమ, మైనారిటీ గురుకుల తదితర పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయని డీఈఓ గోవిందరాజులు తెలిపారు. సెలవుల్లో విద్యార్థులకు ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని, ఒకవేళ నిర్వహిస్తే ఆయా విద్యా సంస్థల యొక్క గుర్తింపు రద్దు చేస్తామని అన్నారు. కాగా, బుధవారం విద్యా సంవత్సరం చివరి పనిరోజు కావడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులను అందజేశారు. అనంతరం సెలవులు ఇస్తున్నట్లు తెలపడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. జిల్లా కేంద్రంలోని పలు వసతి గృహాల్లోని విద్యార్థులను వారి తల్లిదండ్రులు స్వగ్రామానికి తీసుకువెళ్లారు.
నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు


