నర్వ: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ ఫలాలను ప్రజల వద్దకు చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని బీఆర్‌ఎస్ మక్తల్ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ మండల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో పాటు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపు చూస్తున్నారని, దీనికి కారణం ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ ఫలాలే నిదర్శనమన్నారు. మక్తల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపట్టిన రైతు సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి పనులను ప్రతి గ్రామంలో తెలియజేసి, రాబోవు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా మక్తల్‌లో ఎగరవేయాలని కోరారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తనను ఆదరిస్తున్న ప్రజలకు, అందుకు కృషి చేసిన కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవరి మల్లప్ప, నర్వ మండల అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, నర్వ, మరికల్ ఎంపీపీలు జయరాములుశెట్టి, శశికళ, జెడ్పీటీసీ గౌనిజ్యోతి, విండో చైర్మన్ బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ వీణావతి, రైతుసమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మండ్ల చిన్నయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


