● కర్నూలులో ఈఎన్‌టీ వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు
వర్క్‌షాపులో పాల్గొన్న వైద్య విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం
కర్నూలు(హాస్పిటల్): పెద్ద కోతలు లేకుండా సూక్ష్మమైన ఎండోస్కోపి సహాయంతో శస్త్రచికిత్స ఎలా చేయాలో ఈఎన్‌టీ వైద్యులు వివరించారు. కర్నూ లు నగరంలో మూడు రోజుల పాటు నిర్వహించే 44వ రాష్ట్రస్థాయి ఈఎన్‌టీ వైద్యుల సదస్సు ప్రారంభమైంది. ఇందులో భాగంగా శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజీలో ఐదు అంశాలపై వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 348 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హా జరయ్యారు. గొర్రె తలపై ఎండోస్కోపిక్ సైనస్ సర్జ రీ ఎలా చేయాలో చూపించారు. అలాగే గొర్రె ఊపిరితిత్తులు, కృత్రిమ నమూనాలపై బ్రాంకోస్కోపి విధానాన్ని వివరించారు. ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీపై శిక్షణ ఇచ్చారు. ముఖం రూపాన్ని, ఆకారాన్ని మెరుగుపరిచేందుకు, పునరుద్ధరించేందుకు చేసే వైద్య ప్రక్రియలను నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులు వివరించారు. వర్క్‌షాప్‌ల అనంతరం నూతన వైద్యుల శాసీ్త్రయ పరిశోధనతో కూడిన రోగుల వైద్య/శస్త్రచికిత్స విధానాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఈఎన్‌టీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, నిర్వహణ కార్యదర్శి డాక్టర్ బి.జయప్రకాష్‌రెడ్డి, నిర్వాహక చైర్మన్ డాక్టర్ పి.హరికృష్ణ మాట్లాడుతూ ఇలా ంటి కార్య శిబిరాలు తరచుగా నిర్వహిస్తే వైద్యుల్లో నైపుణ్యం మెరుగుపడుతుందన్నారు. శని, ఆదివారా ల్లో రాష్ట్రస్థాయి మహాసభలు నంద్యాల రోడ్డులోని కె.ఫార్చూన్‌లో నిర్వహిస్తామన్నారు. వీటిని ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కోశాధికారి డాక్టర్ మహేంద్రకుమార్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కాలేజీ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.హరిచరణ్ పాల్గొన్నారు.


