హొళగుంద: బండిని లాగుతూ ఉన్నట్టుండి కుప్పకూలి ఒక ఎద్దు అక్కడికక్కడే మృతిచెందింది. ఈ దుర్ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. హొళగుందకు చెందిన దిడ్డి నాగప్ప అనే రైతు తన ఎద్దులను బండికి కట్టి కోగిలతోట రోడ్డులో పొలం పనికి వెళ్తున్నాడు. ఒక ఎద్దు ఉన్నట్టుండి కిందపడిపోయి గిలగిల కొట్టుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఎద్దు విలువ దాదాపు రూ.80 వేలు ఉంటుందని రైతు విలపించాడు. వర్షాలు లేక పంటలు పండగ దివాలా తీస్తున్న సమయంలో కాడెద్దు మృతి చెందితే ఎలా బతకాలి అని రైతులు కన్నీటి పర్యంతమయ్యాడు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం ముద్దటమాగి గ్రామానికి చెందిన కురువ లింగన్న అనే రైతుకు చెందిన ఎద్దు కూడా పొలంలో మడక దున్నుతూ కుప్పకూలి మృత్యువాత పడింది.


