కౌతాళం: అమావాస్య సందర్భంగా శుక్రవారం ఉరుకుంద ఈరన్నస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారి మూలవిరాట్‌కు సుప్రభాతసేవ అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. దర్శనం కోసం గంటకు పైగా సమయం పట్టింది. భక్తుల సౌకార్యర్థం ఆదోని, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని రాయచూరు, శిరుగుప్ప డిపోలవారు ప్రత్యేక బస్సులను నడిపారు. కౌతాళం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
మల్లన్నకు నృత్యనీరాజనం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆలయ దక్షిణమాఢవీధిలోని నిత్యకళావేదికపై హైదరాబాద్‌కు చెందిన నృత్య అకాడమి వారు సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. ర్యక్రమంలో నాట్యగణపతి, ప్రణవాకారం, భో శంభో, శివపంచాక్షరి, శివాష్టకం తదితర గీతాలకు, అష్టకాలకు రమేష్, విశిష్ట, జీవిత, చరిత్ర, సహస్ర, నిత్యవర్షిణి, సాత్విక తదితరులు నృత్యప్రదర్శన ప్రదర్శించారు.
మందు బాబులకు జైలు శిక్ష
డోన్ టౌన్: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టణ పోలీసులకు పట్టుబడిన ముగ్గు రు వ్యక్తులకు జైలు శిక్ష పడిందని సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన చిన్నబాబు అనే యువకునికి ఏడు రోజులు, పట్ట ణంలోని కొత్తపేటకు చెందిన ఈడిగ కుందనం ఉపేంద్రగౌడ్, చిగురమానుపేటకు చెందిన గుండెపోగు దేవేంద్రకు మూడు రోజుల పాటు జైలు శిక్షలు విధిస్తూ జడ్జి నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు సీఐ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపటం వలన వారి ప్రాణాలతో పాటు అమాయక ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల పోలీసు, న్యాయశాఖలు కఠిన చర్యలు తీసుకుంటుందని సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపారు.
దోమల నివారణకు చెరువుల్లో ‘గంబూసియా’ విడుదల
కర్నూలు(హాస్పిటల్): దోమల లార్వాల నివారణకు మలేరియా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని పలు చెరువుల్లో గంబూసియా చేపల ను వదిలారు. జిల్లా మలేరియా అధికారి టి. వెంకటేశులు ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో ని కోడుమూరు, పత్తికొండ, దేవనకొండ, కర్నూలు రూరల్ సబ్ యూనిట్ పరిధిలోని వివిధ గ్రామాల్లో నీరు నిల్వ ఉన్న బావులు, నీ టి గుంతలు, చెరువులను పరిశీలించారు. దో మల లార్వా అభివృద్ధిని అరికట్టేందుకు ఈ చేపలను వదులుతున్నట్లు మలేరియా అధికారి వెంకటేశులు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి ఎస్.విజయ్‌కుమా ర్, సబ్ యూనిట్ అధికారులు రంగస్వామి, వెంకటేశ్వర్లు, కృష్ణుడు, నజీర్ అహ్మద్, సూపర్‌వైజర్లు, హెల్త్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం స్వాధీనం
డోన్ రూరల్: ప్యాపిలి మండల కేంద్రంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 250 కేజీల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి పట్టుకొని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించారు. సమాచారం అందుకున్న ఆర్‌ఐ సుజాత, రెవెన్యూ అధికారులు సత్యనారాయణ, శివానందలు పాల్గొన్ని రేషన్ బియ్యం ఉన్న ఆటోను స్టేషన్‌కు తరలించి సీజ్ చేయించారు. కొందరు వ్యక్తులు ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యాన్ని సేకరించి డోన్, ప్యాపిలి, కొత్తపల్లి, కేఈ కృష్ణమూర్తి నగర్ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన పాయింట్‌కు తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఆయా ప్రాంతాలకు చేరిన తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


