నంద్యాల(వ్యవసాయం): వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని ఐసీడీఎస్ పీడీ లీలావతి దేవి పేర్కొన్నారు. శుక్రవారం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ల కార్యాలయంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. కులమతాలకు అతీతంగా నిర్వహించే అతిపెద్ద పండుగ అని, ప్లాస్టారాఫ్ ప్యారీస్ విగ్రహాలను వాడకుండా మట్టి విగ్రహాలతో పూజించాలని వారు కోరారు. పండుగ అనంతరం ఇంట్లోనే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరమ్మ, వన్‌స్టాఫ్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


