మల్లన్న సేవలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి | - | Sakshi
Sakshi News home page

మల్లన్న సేవలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి

Sep 12 2026 1:48 AM | Updated on Sep 12 2026 1:48 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శుక్రవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఆయనకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ, అర్చకస్వాములు స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవిని దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి గౌరవార్థం వేదపండితులు వేదగోష్టి నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి భక్తులకు అనుగ్రహభాషణ చేశారు.

హజ్‌ యాత్రికులకు వైద్య పరీక్షలు

గోస్పాడు: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ జిలానీ, ఇన్‌చార్జ్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ శారదాబాయి ఆధ్వర్యంలో శుక్రవారం హజ్‌యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హజ్‌ యాత్ర–2027 వెళ్తున్న యాత్రికులకు రెండవ రోజు వైద్య శిబిరంలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 150 మందికి వైద్య పరీక్షలు పూర్తి చేశామన్నారు. ప్రతి ఒక్కరికీ సీబీపీ, ఎల్‌ఎఫ్‌టీ, చెస్ట్‌ ఎక్స్‌రే, ఈసీజీ, ఆర్‌బీఎస్‌, బ్లడ్‌షుగర్‌ తదితర పరీక్షలు నిర్వహించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు అందించామన్నారు. జిల్లా హజ్‌ సొసైటీ అధ్య క్షులు డాక్టర్‌ ఇంతియాజ్‌ అహమ్మద్‌ ఆధ్వర్యంలో యాత్రికులకు భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్లు ప్రసన్న లక్ష్మి, శంకర్‌ నరేన్‌, మహమ్మద్‌ రఫీ, నుసృద్‌ పాల్గొన్నారు.

ఎస్సార్బీసీ ఈఈ బాధ్యతల స్వీకరణ

కొలిమిగుండ్ల(అవుకు): అవుకు ఎస్సార్బీసీ ఈఈగా భవాని ప్రసాద్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గోరుకల్లు ఈఈగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఉన్నతాధికారులు అవుకు ఎస్సార్బీసీ అదనపు బాధ్యతలు అప్పగించారు. విధుల్లో చేరగానే డీఈలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అవుకు రిజర్వాయర్‌, ఇతర స్లూయిస్‌లకు సంబంధించిన లీకేజీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులకు కృషి చేస్తామన్నారు.

అంధుడి కుటుంబంపై

కక్ష సాధింపు

కొలిమిగుండ్ల: నిరుపేద అంధుడి కుటుంబంపై అధికార పార్టీ కార్యకర్తలు మానవత్వాన్ని మర్చిపోయి కక్ష సాధింపు చర్యలకు దిగారు. మండల కేంద్రం కొలిమిగుండ్ల ఎస్సీ కాలనీకి చెందిన నాగభూషణంకు పదేళ్ల క్రితం కంటి చూపు పూర్తిగా పోయింది. అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు అతనికి పింఛన్‌ సైతం అంద డం లేదు. భార్య ఫక్కీరమ్మ ఎస్సీ ప్రాథమిక పాఠశాలలో ఐదేళ్ల నుంచి స్వీపర్‌గా పని చేస్తు వచ్చే వేతనంతో కుటుంబాన్ని పోషిస్తుండేది. ఇటీవల కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు ఉన్నట్లుండి ఫక్కీరమ్మను పనిలో నుంచి తొలగించి తమ వాళ్లను నియమించారు. ఇదేమని ప్రశ్నించినందుకు తనపై దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే దాడి చేసిన వాళ్లపై కాకుండా తిరిగి తమపైనే పోలీసులు కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏడాది పాటు వేతనం రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కుటుంబాన్ని పోషించేందుకు హోటల్‌తో పాటు ఇతర ఇళ్లలో పని చేస్తున్నానని వాపోయారు. తమలాంటి వాళ్లపైనా అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యల కు పాల్పడటం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement