కర్నూలు (టౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురికి వైఎస్సార్‌సీపీ పదవులు దక్కాయి. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన కాల గగ్గారి మధుసూధన్‌ను పార్టీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించారు. అలాగే నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన ఆకుల నాగ లింగమయ్యను జిల్లా వీరశైవ లింగాయత్ విభాగం అధ్యక్షులుగా నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చర్యలు
కర్నూలు కల్చరల్: దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.రామాంజనేయులు ఆదేశించారు. శుక్రవారం కర్నూలు డీసీ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల అసిస్టెంట్ కమిషనర్‌లు, ఇన్‌స్పెనక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సమావేశంలో కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, నంద్యాల డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ పాండురంగారెడి పాల్గొన్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్


