జియారత్‌తో ముగిసిన ఎల్లార్తి ఉరుసు | - | Sakshi
Sakshi News home page

జియారత్‌తో ముగిసిన ఎల్లార్తి ఉరుసు

Sep 11 2026 11:09 AM | Updated on Sep 11 2026 11:09 AM

ఫైనాన్స్‌ వారి వేధింపులు తాళలేక..

హొళగుంద: ఎల్లార్తిలో షేక్షావలి, షాషావలి తాతల ఉరుసు గురువారం జియారత్‌ కార్యక్రమంతో ప్రశాంతంగా ముగిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళునాడు నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దర్గాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవంలో భాగంగా 8న గంధం, 9న ఉరుసు, 10న జియారత్‌ కార్యక్రమాలు జరిగాయి. దర్గాల సయాద్‌ నసీన్‌ ముతవలి, పీఠాధిపతి నూర్‌బాబా ఖాద్రి భక్తులకు ధర్మసందేశాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. ఏపీ వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ఈఓ ఇమ్రాన్‌, ఇన్‌స్పెక్టర్‌ సోహెల్‌ పర్యవేక్షణలో జరిగిన ఉరుసులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హొళగుంద ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

కర్నూలు(హాస్పిటల్‌): ఫైనాన్స్‌ వారి వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతకు ముందు ఒక వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. బాధితుని కథనం మేరకు.. దేవనకొండ మండలం ఈదుల దేవరబండ గ్రామానికి చెందిన సుంకన్న కుమారుడు బి.బ్రహ్మయ్య(32) ఊళ్లో తండ్రికి చెందిన ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో కోడుమూరులో ఓ చిన్న హోటల్‌ నిర్వహిస్తున్నాడు. ఆయన మూడున్నర ఏళ్ల క్రితం ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలో రూ.10 లక్షల రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా రూ.18వేలు కంతు చెల్లిస్తూ వచ్చాడు. అయితే మూడు నెలలుగా అతను కంతులు చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ సంస్థ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై బ్రహ్మయ్య కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్‌లోగా బకాయిలు చెల్లించాలని కోర్టులు ఉత్తర్వులు ఇచ్చింది. అయినా సరే ఫైనాన్స్‌ సంస్థ ప్రతినిధులు కొందరు నెలరోజులుగా బ్రహ్మయ్య వద్దకు వచ్చి బకాయిలు తీర్చాలని, లేకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తూ వచ్చారు. రెండు రోజుల క్రితం ఈ బెదిరింపులు మరీ ఎక్కువ కావడంతో బాధపడుతూ బ్రహ్మయ్య బుధవారం రాత్రి కోడుమూరులోని తన హోటల్‌ ఎదుట క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్స నిమిత్తం వెంటనే అతన్ని కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి

కడప కోటిరెడ్డిసర్కిల్‌: కడప రైల్వేస్టేషన్‌లో గురువారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో గుండప్ప అనే వ్యక్తిని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. మృతుడు కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పీఆర్‌ పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement