నమ్మ కన్నడ నాడు! | - | Sakshi
Sakshi News home page

నమ్మ కన్నడ నాడు!

Sep 11 2026 10:57 AM | Updated on Sep 11 2026 10:57 AM

ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంత వాసుల జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం అరుదైన విద్యుత్‌ కాంతులతో జిగేల్‌మంది. గురువారం టీబీ బోర్డు అధికారులు కొత్త రంగు రంగుల విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేసి ట్రయల్‌ రన్‌ చేశారు. జలాశయానికి సంబంధించి 33 క్రస్టుగేట్లు కలిగిన ప్రాంతం మొత్తం కర్ణాటక రాష్ట్ర జెండా (రాష్ట్రీయ జెండా) రంగుల లైట్లను ఏర్పాటు చేసి రాత్రి వాటిని పరీక్షించారు. ఇటివల స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండా రంగుల లైట్లు ఏర్పాటు చెసిన అధికారులు నవంబర్‌ 1న కర్ణాటక రాజ్యోత్సవను దృష్టిలో ఉంచుకుని ఈ దీపాలను ఏర్పాటు చేసి పరీక్షించినట్లు తెలుస్తోంది. ఈ దీపాలు వెలిగిన వేళ టీబీ డ్యాం ఈ కొత్త విద్యుత్‌ కాంతులతో ప్రకాశించింది.

– హొళగుంద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement