కర్నూలు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్) జిల్లా నాలుగవ, ఏపీ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ మొదటి జిల్లా మహాసభలను ఈనెల 19న కర్నూలులో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.గోరంట్లప్ప తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్‌లో జిల్లా మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాసభలను కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో నిర్వహిస్తామన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలతోపాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. జర్నలిస్టు ల హక్కుల పరిరక్షణకు ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. జిల్లా మహాసభలకు అన్ని నియోజకవర్గాల జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శివశంకర్, జిల్లా సీనియర్ నాయకులు పి.చంద్రయ్య, టిజి ప్రసాద్, డి.చంద్రమోహన్, వినయ్ కుమార్, శివన్న, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు డి.హుస్సేన్, వడ్డే శ్రీనివాసులు, విజయ్ కరణ్ తదితరులు పాల్గొన్నారు.


