ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి

Sep 11 2026 10:57 AM | Updated on Sep 11 2026 10:57 AM

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులకు మెరుగైన ఇంటర్న్‌షిప్‌తో పాటు, ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య వి. వెంకట బసవరావు తెలిపారు. గురువారం వర్సిటీలో జరిగిన సమావేశంలో ప్లేస్‌మెంట్స్‌కు ఎంపికై న 48 మంది విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల వర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఇంటర్న్‌షిప్‌ – ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించినట్లు పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆప్టిట్యూడ్‌, ఇంటర్వ్యూ నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. విద్యార్థులకు మరిన్ని ఇంటర్న్‌షిప్‌, ప్లేస్‌మెంట్‌ అవకాశాలు కల్పించేందుకు ప్రముఖ సంస్థలతో సమన్వయం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య బి.విజయకుమార్‌ నాయుడు, ఇంజినీరింగ్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ ఆచార్య వెంకట సుందరానంద పుచ్చ, వర్సిటీ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ అధికారులు డాక్టర్‌ జి. సురేంద్ర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement