కోసిగి: ‘విజృంభిస్తున్న విషజ్వరాల’ అనే శీర్షికన గురువారం సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. కోసిగి ప్రాథమిక వైద్యాధికారి ఇబ్ర హీం, ఆదోని మలేరియా సబ్‌యూనియట్ ఆఫీసర్ మంజునాథ్ తమ సిబ్బందితో కలిసి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. గ్రామంలో వైద్య బృంద సభ్యులు ఇంటింటా తిరిగారు. జ్వరాలు ప్రబలిన వారిని పరీక్షలు చేసి ఆరోగ్య పరిస్థితుల అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రతి కాలనీలో మురుగు కాల్వలను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్‌ను పంచాయతీ కార్యదర్శి అయ్యస్వామి చల్లించారు. దోమలు రాకుండా దోమ తెరలను వాడాలని సూచించారు. గ్రామంలో మూడు రోజుల పాటు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. అధికారులు గ్రామానికి రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేసి ‘సాక్షి’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.


