ఎండుతున్న పంట‘కేసీ’ చూడండి సార్‌! | - | Sakshi
Sakshi News home page

ఎండుతున్న పంట‘కేసీ’ చూడండి సార్‌!

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

ట్యాంకర్‌ ద్వారా నీరు పడుతున్న రైతు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేవు. పైగా బోరు బావుల్లో నీరు అడుగంటిపోతున్నాయి. వీటికి తోడు రాత్రి వేళల్లో లోడ్‌ రిలీఫ్‌ పేరుతో సుమారు రెండు గంటలకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ప్రయత్నాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మహానంది మండలం బొల్లవరం గ్రామంలోని ఓ రైతు తాను సాగు చేసిన మొక్కజొన్నను కాపాడుకునేందుకు ట్యాంకర్‌తో కేసీ నుంచి నీరు తెచ్చి పంటకు పారించుకున్నాడు. ఇది లా ఉండగా కేసీ కాలువ అధికారులు రైతులు ఫొటో లు తీసి బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మానవత్వంతో స్పందించి తమపై కనికరం చూపాలని పలు గ్రామాల రైతులు వేడుకుంటున్నారు. – మహానంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement