డప్పు కళాకారుల పింఛన్లపై స్పష్టత కరువు | - | Sakshi
Sakshi News home page

డప్పు కళాకారుల పింఛన్లపై స్పష్టత కరువు

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

కర్నూలు(అర్బన్‌): ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్‌ పథక ంలో భాగంగా వివిధ రకాల పింఛన్లకు దరఖాస్తు ప్రక్రి య ప్రారంభమైనా, డప్పు కళాకారుల విషయంలో స్పష్టత కొరవడింది. డప్పు కళాకారులు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు/ఆదాయ ధృవీకరణ పత్రంతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసిన సర్టిఫికేట్‌ ను అందజేయాలని స్పష్టం చేశారు. కాగా, గతంలో జిల్లాలోని డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులను అందించారు. అయితే ప్రస్తుతం పింఛన్ల దరఖాస్తు కు సచివాలయాలకు వెళితే సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసిన సర్టిఫికెట్‌ను అందజేయాలని కచ్చితంగా చెబుతున్నారని వాపోతున్నా రు. ఈ నేపథ్యంలోనే మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన డప్పు కళాకారులు పదుల సంఖ్యలో స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి వచ్చి తమకు సర్టిఫికెట్లు అందించాలని కోరారు. అయి తే ఈ విషయంలో తమ శాఖకు చెందిన ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక చెబుతున్నా రు.పింఛన్లకు దరఖాస్తు సమయం చాలా తక్కువగా ఉండటం, మూడు రోజులు వరుస సెలవులు కావ డం దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement