సబ్సిడీ వేరుశనగ స్వాహా! | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ వేరుశనగ స్వాహా!

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

డోన్‌ టౌన్‌ (ప్యాపిలి)/డోన్‌: తమది రైతు ప్రభుత్వం అంటూ టీడీపీ నాయకులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడీకి పొంతన లేకుండా పోతోంది. రైతులకు అందాల్సిన సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలను అధికారుల అండదండలతో టీడీపీ నాయకులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నాలుగు రోజుల క్రితం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనం మరువకముందే సబ్సిడీ వేరుశనగను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 29న డోన్‌ నియోజకవర్గంలోని ఎనుగుమర్రి గ్రామంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామానికి మంజూరైన విత్తనాలను అర్హులైన రైతులకు అందించకుండా గ్రామ టీడీపీ నాయకుల సిఫార్సుతో కొద్దిమంది ఆ పార్టీ వారికి అందించి మిగతా విత్తనాలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలోని సచివాలయంలో ఉంచిన స్టాకును అదే గ్రామానికి చెందిన వ్యాపారికి విక్రయించగా సదరు వ్యక్తి వాటిని రెండు వాహనాల్లో బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement