మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలి

Sep 4 2026 1:48 AM | Updated on Sep 4 2026 1:48 AM

నంద్యాల(న్యూటౌన్‌): మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయంలో నేషనల్‌ ఎంటర్‌ పెన్యూర్‌ డే క్యాంపెయిన్‌, పీఎంఎఫ్‌ఎంఈ గ్రాడ్యుయేషన్‌డే పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదికి బ్యాంక్‌ లింకేజీ రుణం కింద రూ.1,342 కోట్ల లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.573 కోట్లు మంజూరయ్యాయన్నారు. అలాగే సీ్త్రనిధి ద్వారా ఈ ఏడాదికి రూ.378 కోట్ల రుణం లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.127.74 కోట్లు ఇచ్చామన్నారు. మండలాల వారీగా సాధించాల్సిన లక్ష్యాలు, యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసుకొని ముందుకెళ్లాలని ఆదేశించారు. కార్యక్రమంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీజనల్‌ మేనేజర్‌ అనిల్‌ మాట్లాడుతూ మహిళలు డీపీఎంఎస్‌, ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులు, యూనియన్‌ బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement