మొక్కజొన్న పంటపై పందుల దాడి | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న పంటపై పందుల దాడి

Sep 3 2026 8:53 AM | Updated on Sep 3 2026 8:53 AM

తూనికలు, కొలతలశాఖ అధికారుల దాడులు

గడివేముల: ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న పంటలపై పందులు స్వైర విహారం చేయడంతో రైతులు నష్టపోతున్నారు. గడివేముల సమీపంలోని పొలాల్లో మొక్కజొన్న, పత్తి, సోయాబీన్‌ పంటలపై పందులు దాడులు చేస్తున్నాయి. గ్రామానికి చెందిన కౌలు రైతు వెంకటేశ్వర్లు సాగు చేసిన మొక్కజొన్న పంటపై పందులు దాడి చేయంతో పంటంతా ధ్వంసమైంది. మరో నెలలో చేతికి రావాల్సిన పంట మొత్తం నాశనమైంది. పందుల నిర్వాహకులకు హెచ్చరించినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నా రు. పందులకు భయపడి రాత్రిళ్లు పొలం వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.

వచ్చే నెల 9న తుది ఓటరు జాబితా

నంద్యాల(అర్బన్‌): తుది ఓటరు జాబితా ప్రచురణ అక్టోబర్‌ 9న ఉంటుందని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పారదర్శకంగా ఓటరు జాబితా తయారీకి చర్యలు చేపడుతున్నామన్నారు.‘సర్‌’లో భాగంగా ఈనెల 10 వరకు అభ్యంతరాలు,దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపారు. అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారం చూపిన తర్వాత ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందని పేర్కొన్నారు. ఓటరు వివరాలు తెలుసుకునేందు కు వెబ్‌సైట్‌, మొబైల్‌ ద్వారా 1950 నంబరుకు ఈసీఐ స్పేస్‌ ఓటరు ఐడీ కార్డు నంబరుతో మెసేజ్‌ చేస్తే ఓట రు వివరాలు తెలుసుకోవచ్చన్నారు. కొత్తగా ఓటరు నమో దుకు వెబ్‌సైట్‌కు ఈసీఐనెట్‌ మొబైల్‌ అప్లికేషన్‌, ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, అసిస్టెంట్‌ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, బీఎల్‌ఓలను సంప్రదించి దరఖాస్తును సమర్పించుకోవాలన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సంబంధిత ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ, బీఎల్‌ఓలు, జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొని పోవచ్చన్నారు.

పదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

వెలుగోడు: పదేళ్ల బాలికపై ఆరవై ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన వెలు గు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబరు 1న మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికకు వెలుగోడు పట్టణానికి చెందిన వృద్ధుడు చిన్న బయన్న మాయమాటలు చెప్పాడు. ఊరి బయట ఉన్న శివాలయం వెను క చెట్ల పొదల్లోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

మహానంది: మహానంది దేవస్థానం పరిధిలోని దుకాణాలపై బుధవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దేవస్థానం పరిధిలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తూ భక్తుల సొమ్మును దోచుకుంటున్నారని కొందరు భక్తులు ఇటీవల జిల్లా కలెక్టర్‌ రాజకుమారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు, సిబ్బంది బాషా, తదితరులు దాడులు చేశారు. ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తున్న వారికి రూ. 2 వేల వరకు జరిమానాలు విధించారు.

పట్టించుకోని దేవస్థానం అధికారులు..

మహానంది దేవస్థానం పరిధిలో తోపుడు బండ్లతో పాటు తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేసుకుని సుమారు వంద మందికిపైగా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపారులు తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ భక్తుల నుంచి అధికంగా వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. ఈ విషయంపై దేవస్థానం అధికారులు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని భక్తులు మండిపడుతున్నారు. గతంలో దుకాణాల వద్ద టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్‌, తదితర వస్తువుల ధరలను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేశా రు. కానీ వ్యాపారులు మాత్రం వాటిని రెండు మూడు రోజులు మాత్రమే ఉంచి మూలన పడేశారు. వ్యాపారులపై తగిన చర్యలు తీసుకుని ఎమ్మార్పీకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement