ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున మూలమూర్తులను సుప్రభాతసేవతో మేల్కొల్పి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచారు. పంచామృతాలతో అభిషేకించి వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య ధూపదీపాలతో మహా మంగళహారతి అందించారు. రాత్రి విశేష అలంకరణలో స్వామి, అమ్మవార్లు పల్లకీపై కొలువుదీరి తిరువీధిలో విహరించారు.


