పూర్వారాధన వేడుక సందర్భంగా తమిళనాడు శ్రీరంగపట్నం శ్రీరంగనాథ స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. స్థానిక మహా ముఖద్వారం నుంచి రంగనాథుడి పట్టువస్త్రాలతో ఊరేగింపుగా శ్రీమఠం చేరుకున్నారు. స్వామిజీ పట్టువస్త్రాలను పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా స్వీకరించారు. రాఘవేంద్రుల మూల బృందావనం చేరుకుని పట్టు వస్త్రాలకు విశేష పూజలు నిర్వహించారు. ఊంజల మంటపంలో రంగనాథుడి ఆలయ పండితులను సన్మానించారు. పట్టువస్త్రాల సమర్పణ వెనుక దాగిన చరిత్రను స్వామిజీ భక్తులకు ప్రవచించారు.


