నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ

Aug 24 2026 1:25 AM | Updated on Aug 24 2026 1:25 AM

మరో ఉద్యమం తప్పదు

నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఈనెల 24వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap. gov. in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులు స్వీకరించారు.

ఘాటెక్కిన ఉల్లిధర

నంద్యాల(న్యూటౌన్‌): ఉల్లిధరలు ఘాటెక్కాయి. కోయకుండానే కనీళ్లు తెప్పిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో కిలో ఉల్లిపై రూ.20 నుంచి రూ. 25 ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.50 పలుకుతుంది. పెరుగుతున్న ధరను చూసి వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో ఉల్లి వినియోగానికి తగ్గట్టు ఉత్పత్తి లేదు. దీంతో ఇంతర ప్రాంతాల నుంచి వచ్చే సరఫరా పైనే ఆధారపడాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఉల్లి ధరలు కూడా పెరుగుతుండటంతో నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

● ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

జి.హృదయరాజు

కర్నూలు(సెంట్రల్‌): ఉపాధ్యాయుల, ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే మరో ఉద్యమం తప్పదని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు అన్నారు. ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ నియమించి 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా గౌరవాధ్యక్షులు యస్‌.ఇస్మాయిల్‌, పూజారి లక్ష్మయ్య, ఐ.మరియానందం మాట్లాడారు. ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ను రద్దు చేయాలన్నారు. జీతాలకు – ఐ గాట్‌ కర్మ యోగి యాప్‌ లకు ముడిపెట్టరాదని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement