డోన్‌ ఎంపీడీఓ నూతన భవనం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

డోన్‌ ఎంపీడీఓ నూతన భవనం ప్రారంభం

Aug 24 2026 1:25 AM | Updated on Aug 24 2026 1:25 AM

జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డిని అభినందించిన ఎంపీపీ

డోన్‌: నూతన డోన్‌ మండల ప్రజా పరిషత్‌ భవనాన్ని ఆదివారం జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రారంభించారు. ఈ భవనంలో ఆధునిక వసతులు కల్పించేందుకు రూ.50 లక్షల జిల్లా పరిషత్‌ నిధులను కేటాయించినందుకు జెడ్పీ చైర్మన్‌కు ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్‌కుమార్‌ కృతజ్ఞత తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ఆర్ధిక శాఖమాత్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.1.5 కోట్లు వెచ్చించి అన్ని హంగులతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. టీడీపీ నేతలతో గత రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ భవనాన్ని ఆదివారం జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులు, వైస్‌ ఎంపీపీ ఎర్రిస్వామిల సమక్షంలో ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి తన సీటులో ఆశీనులయ్యారు. ఎంపీటీసీ సభ్యులు సుధాకర్‌ యాదవ్‌, సుమిత్రమ్మ, రామలక్ష్మమ్మ, సునీత, జానకిరాముడు, రామలక్ష్మి, ఓబులేసు, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ మల్లెంపల్లె రామచంద్రుడు, పార్టీ నాయకులు సోమేష్‌యాదవ్‌, మల్లికార్జునరెడ్డి, చిరంజీవి, పోస్టు ప్రసాద్‌, వేమారెడ్డి, మద్దిలేటి, రాజ్‌కుమార్‌, రాజు, మల్యాల శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఈ రాజవర్ధన్‌, జాకీర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement