కౌతాళం: శావ్రణమాస ఉత్సవాల్లో భాగంగా రెండో సోమవారం ఉరుకుంద ఈరన్నస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. క్షేత్రంలో రెండో, మూడో సోమవారం సుమారు రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఈ ఏడాది శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలే ఉన్నాయి. రెండో సోమవారం స్వామిని దర్శించుకోవడానికి చాలా మంది ఆదివారమే వచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆధికారులు ప్రత్యేక, శీఘ్ర, అతిశీఘ్ర, ఉచిత, వీఐపీ దర్శన అవకాశాలు కల్పించే ఏర్పాట్లు చేశారు. రాత్రంతా దర్శనాలు ఉంటాయని, రాత్రి 12 గంటల అనంతరం పూజల కోసం అరగంట పాటు దర్శనాలు ఉండబోవని ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. చాలా మంది భక్తులు ఆలయంలో ఆరుబయటే సేదతీరుతూ కనిపించారు.


