పాణ్యం: గాలేరు నగరి సుజలస్రవంతి కాల్వలో నీటి ప్రవా హం పెరుగుతోంది. గోరుకల్లు నుంచి బ్యాక్ వాటర్‌ను తాగునీటి కోసం అవుకు జలాశయానికి తరలిస్తున్నారు. అయితే ఆదివారం గాలేరు గేట్లను తాకిన నీరు సోమవారం వెయ్యి క్యూసెక్కులకు పెరిగింది. బానకచెర్ల నుంచి ప్రస్తుతం ఇన్‌ఫ్లో 5 వేల క్యూసెక్కులు కాగా గోరుకల్లులో 5.50 టీఎంసీలు నిల్వ ఉండేలా చూస్తూ ఆపై వచ్చిన నీటిని యథావిధిగా గాలేరు కాల్వ ద్వారా అవుకు తరలిస్తున్నారు. అయితే ఎస్సార్బీసీ కాల్వ ద్వారా తరలించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.


