డోన్: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇన్‌స్టిట్యూట్ అఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐటీడీఆర్) పనులను రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ జాయింట్ కమిషనర్ డాక్టర్ సుందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. డోన్ మండలం కొత్తకోట గ్రామం వద్ద 10 ఎకరాల స్థలంలో రూ.2 కోట్ల వ్యయంతో ఈ సెంటర్ భవనాల పనులను గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం 90 శాతం పూర్తి చేసింది. మిగిలిన 10 శాతం పనుల పురోగతిపై డాక్టర్ సుందర్‌రెడ్డి ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చించారు. పనులు నాణ్యతగా చేపట్టాలన్నారు. త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే ఏటా వందలాది మంది నిరుద్యోగులకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడమే కాక భారీ వాహనాలు నడిపే వారి కొరత దేశంలో తీరుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ డీఈ మదనగోపాల్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కాంత్రి కుమార్ ఉన్నారు.


