పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Aug 15 2026 1:51 AM | Updated on Aug 15 2026 1:51 AM

జిల్లా కలెక్టర్‌ రాజ కుమారి

నంద్యాల(అర్బన్‌): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో శుక్రవారం ఉదయం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనంజయ్‌, ట్రైనీ కలెక్టర్‌ ప్రియాంక మాట్లాడుతూ దేశ అభివృద్ధి కేవలం ఆర్థికంతో కాకుండా ప్రజల సంతోష, ఆరోగ్యం, విద్య వంటి ప్రమాణాలతో కూడి ఉంటుందన్నారు. జిల్లా అధికారులు, సీఆర్‌ఎస్‌ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement