ఆళ్లగడ్డ: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్న సామెతను టీడీపీ నాయకులు నిజం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తుండగా గ్రామాల్లో ఆపార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీ ఆస్తులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. తాజాగా యాదవాడ గ్రామంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. వైఎస్సార్‌సీపీ నాయకుడు, తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వెంట ఉండేవారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పొల్గొంటారు. ఈ క్రమంలో గురువారం మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు వచ్చిన సందర్భంగా బిజేంద్రారెడ్డితో పాటు కర్నూలుకు వెళ్లారు. అంతకు రెండు రోజుల ముందు డీఎస్సీ అక్రమాలపై జరిగిన ర్యాలీకి సైతం పెద్ద ఎత్తున కార్యకర్తలతో వెళ్లారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు ఆయనను ఎలాగైనా నష్ట పరచాలని గురువారం రాత్రి పొలం దగ్గర రూంలో దాచి పెట్టుకున్న 20 మందు బస్తాలను గతి తాళం పగుల గొట్టి ఎత్తుకుపోయారు. శుక్రవారం పొలానికి మందు చల్లుదామని పోతే అక్కడ తాళం పగలగొట్టి ఉండటం కనిపించింది. లోపలకు వెళ్లి చూడగా 28 మందు బస్తాలు కనిపించడం లేదు. మోటార్‌సైకిల్ పై రోడ్డు మీదకు మోసుకుని అక్కడి నుంచి ఆటోల్లో తరలించినట్లు తెలుస్తోందని నరసింహారెడ్డి తెలిపారు.
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతిసారీ..
నరసింహారెడ్డి పార్టీ ఆదేశించిన ఏ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోజు ఏదో విధంగా నష్ట పరచడం జరుగుతోంది. గతంలో కూడా పార్టీ ఆదేశించిన కార్యక్రమానికి కార్యకర్తలను తరలించుకు పోవడంతో మరుసటి రోజు పొలం దగ్గర ఉన్న రెండు వరిగడ్డి వాములకు అగ్గి పెట్టి దగ్ధం చేశారు. అంతేకాకుండా పదులసంఖ్యలో మోటర్ వైర్లు, కేబుల్ వైర్లుకట్ చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైఎస్సార్‌సీపీ నాయకుడి పొలంలో
టీడీపీ నాయకుల దోపీడీ?
రూం తాళం పగులగొట్టి
28 బస్తాల మందు బస్తాలు చోరీ
గతంలో గడ్డివాములకు
నిప్పు పెట్టిన వైనం


