ప్రజలకు ‘డిజిటల్‌’ షాక్‌! | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు ‘డిజిటల్‌’ షాక్‌!

Aug 15 2026 1:51 AM | Updated on Aug 15 2026 1:51 AM

ఆలూరు: విద్యుత్‌ బిల్లులను ప్రజలు ఇక డిజిటల్‌ విధానంలో చెల్లించాల్సి ఉంది. ఈఆర్వో (ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసర్‌) కార్యాలయాలు ఇక పనిచేయవు. ఏపీఎస్‌పీడీసీఎల్‌ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్‌ చెల్లింపులకు స్మార్ట్‌ ఫోన్‌ అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌ సరిగా లేకున్నా, స్మార్టు ఫోన్‌ లేకున్నా విద్యుత్‌ బిల్లు చెల్లించే వీలు పడదు. పల్లెల్లో ఇప్పటికీ చాలామంది కీప్యాడ్‌ ఫోన్‌నువినియోగిస్తున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, గూడూరు, ఆలూరు విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ జూనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ ఉప రెవెన్యూ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రతి నెలా 7,38,059 మంది రూ. 49.76 లక్షల మేర విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నారు. నంద్యాల, ఆత్మకూరు, పాణ్యం, కోవెలకుంట్ల బనగానపల్లి, డోన్‌, విద్యుత్‌ సబ్‌డివిజన్లలో ఇదే కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో 9,67,500 మంది విద్యుత్‌ వినియోగదారులు రూ. 58.20 లక్షల చెల్లిస్తున్నారు. ఇక వీరంతా స్మార్ట్‌ ఫోన్లలో క్యూఆర్‌కోడ్‌ ద్వారా బిల్లులు చెల్లించాల్సి ఉంది. అలా చేయకలేకపోతే విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నారు.

ఈఆర్వో కార్యాలయాల మూత

సిబ్బంది కొరత కారుణంగా 2018లో ఈఆర్వో కార్యాలయాల్లో ప్రభుత్వం ఒప్పంద కార్మికులను నియమించింది. వీరికి ఏజేన్సీ నిర్వాహకులు నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వేతనం చెల్లించేవారు. అగ్రిమెంట్‌లో పని దినాలు ముగిసి పోకుండానే వీరి కడుపు కొట్టి ఈఆర్వోలను తొలగించి కార్యాలయాలను తొలగించాలని జూన్‌ 15న ఉత్తర్వులు వచ్చాయి. ఈనెల మొదటివారం నుంచి కార్యాలయాలు శాశ్వతంగా మూతపడ్డాయి. ఒప్పంద కార్మికులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్మార్టు ఫోన్‌లో పేద్వారా విద్యుత్‌ బిలుల్ల చెల్లింపుపై అవగాహన కల్పిస్తున్నా పల్లెల్లో సమస్యలు వస్తున్నాయి. ఆంగళ్లు, పిండిమిషన్లు నిర్వహిస్తున్న వారు కొంత సమస్యను అధిగమించారు. బోరుబావులకు వాడిన విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

ఇక స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే

విద్యుత్‌ బిల్లుల చెల్లింపు

బిల్లు చెల్లించకపోతే

విద్యుత్‌ సరఫరా నిలిపివేత

చిన్న ఫోన్‌ ఉన్న వారికి

తప్పని తిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement