రూ.1కే బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌కార్డు | - | Sakshi
Sakshi News home page

రూ.1కే బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌కార్డు

Aug 15 2026 1:51 AM | Updated on Aug 15 2026 1:51 AM

కర్నూలు(హాస్పిటల్‌): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) అందించే ఫ్రీడమ్‌ 2.0 ప్లాన్స్‌ను ఉపయోగించుకోవాలని ఆ సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కె.రాజేశ్వరరావు చెప్పారు. శుక్రవారం బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.1కే సిమ్‌కార్డును 24 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు ఒక జీబీ డేటా, వంద ఎస్‌ఎంఎస్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. రూ.2,399 వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో 47 అదనపు రోజుల వాలిడిటీ, రోజువారీ 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు అందిస్తున్నామన్నారు. ఇది వచ్చే నెల 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. రూ.499లకే ఫైబర్‌ బేసిక్‌ ప్లాన్‌లో భాగంగా 60 ఎంబీపీఎస్‌ ఇంటర్నెట్‌ వేగం, నెలకు 3300 జీబీ వరకు హైస్పీడ్‌ డేటా, ఉచిత అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉంటాయన్నారు. ఫైబర్‌ ఫ్రీడమ్‌ ప్లాన్‌లో భాగంగా రూ.1,111 (నెలకు) చెల్లిస్తే 200 ఎంబీపీఎస్‌ ఇంటర్‌నెట్‌ స్పీడ్‌, నెలవారీగా 5వేల జీబీ హైస్పీడ్‌ డేటా అందిస్తామన్నారు. అలాగే 25కు పైగా ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌, అపరిమిత ఉచిత వాయిస్‌ కాల్స్‌ ఇందులో లభిస్తాయన్నారు. గతేడాది పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి 4జీ సేవలను ప్రారంభించామన్నారు. ఈ మేరకు జిల్లాలో దాదాపు 380 టవర్లు, 1,080 బీటీఎస్‌లతో విస్తరించినట్లు తెలిపారు. కర్నూలు బీఏలో సగటున నెలవారీ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల సంఖ్య దాదాపు 2లక్షల నుంచి 3.4 లక్షలకు పెరిగిందని వివరించారు. మారుతున్న మొబైల్‌ టెక్నాలజీకి అనుగుణంగా ఈ–సిమ్‌, యూనివర్సల్‌ సిమ్‌ సేవలను కూడా అందిస్తున్నామన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏజీఎం దేవచంద్‌ నాయక్‌, ఏడీఈ మహమ్మద్‌ హుసేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement