నేను పెద్దగా చదవలేదు. నా వద్ద స్మార్టు ఫోన్ ఉన్నా కరెంట్ బిల్లు చెల్లించడం రాదు. మాకు రూ. 200 బిల్లు వచ్చింది. కార్యాలయానికి వెళ్తే మూతేశారు. బిల్లు చెల్లించలేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు.
– గోవిందరాలు, ఆలూరు
మేం వాడుది చిన్న ఫోన్. స్మార్టు ఫోన్‌లో నాకు విద్యుత్ బిల్లు చెల్లించేందుకు రాదు. ఇక్కడ ఆఫీసు ఉంటే బిల్లు కట్టాలని డబ్బులు ఇంటిపక్క వారికి ఇచ్చివేళ్లే వాళ్లం. ఇప్పుడు ఆపరిస్థితి లేదు.
– జోగిబాలి పేడయ్య, ఆలూరు
గ్రామాల్లో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వారందరు వినియోగదారులకు స్మార్టు ఫోన్‌ద్వారా పేమెంట్లను చెల్లించాలని అవగాహన చేస్తున్నారు. కీప్యాడ్ సెల్‌ను వాడుతున్న వారు ఇతరులతో బిల్లులను చెల్లించాలి. ఏపీఎస్‌పీ డీసీఎల్ అధికారులు నిబంధలకు లోబడి పనిచేయాలని. – సంతోష్‌కుమార్, ఏడీఈ ఆలూరు


