మొక్కజొన్న వైపు మొగ్గు | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న వైపు మొగ్గు

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

ల్‌నినో ప్రభావంతో జిల్లా రైతులు తక్కువ నీటితో పండించే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో బోర్లు బావులు, సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంట కాల వ్యవధి కేవలం 3 నెలలు కావడంతో రైతులు ఈ పంటపై ఆసక్తి కనబరుస్తున్నారు. పంటకు 15 రోజులకోసారి నీటి తడులు అందిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 26,364 హెక్టార్లలో మొక్కజొన్న సాగులో ఉంది. దిగుబడి బాగా వస్తే ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ.30 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 59,626 హెక్టార్లలో సాగవగా ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రైతులు వెనకడుగు వేయాల్సి వస్తోంది. మరింత వర్షాలు కురిస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. – నంద్యాల(అర్బన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement